సంపూర్ణ ఆరోగ్యం కొరకు సనాతన ఋషులు క్రియ (ఋషి క్రియ) లను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా అనుసరిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో శాంతియుతమైన జీవితాన్ని గడిపేవారు. కాలక్రమేనా ఈ క్రియా విధానాన్ని ఋషి సంతతి, వారి శిష్యగణం, సాధకుల అభిరుచి మేరకు సులభపరుచుట వలన కలుషితము అయినది. మనం స్వీకరించి, అనుసరించే పధ్ధతి సరిఅయినదిఅయి ఉండాలి. ఆ పధ్ధతి విధి విధానాన్ని సమర్దవంతముగా తెలియచేసి ఆపాదించే నిష్ఠాతుల వృత్తి (సాధకుడు) మనకు కావాలి. ఈ అరుదైన విశిష్ట వ్యక్తి "ధ్యానం మాస్టారు". వీరు క్రియలను స్వయముగా సాధన గావించి రూపొందించిన కోర్సు "క్రియ యోగ".
- ౪౨ (నలభై రెండు) రోజుల పాటు నిరాటంకమైన ఉపవాసము చేసారు.
- గత ౨౦ (ఇరువది) సంవత్సరాలుగా అపక్వాహారము మాత్రమే తీసుకుంటున్నారు.
- గత ౩౪ (ముప్పై నాలుగు) సంవత్సరములుగా క్రియా సాధన చేస్తూ, శరీర అవయవాలపై స్వాధీనతసాధించారు.
- ప్రతి సంవత్సరము ౧౮ (పద్దెనిమిది) రోజులు మౌనం, ధ్యానం, ఆహరరహితముగా ఉండి, ఈ ముప్పేటస్థితిలో ఆత్మశోధన చేసుకుంటూ స్వరూపానందం పొందుతారు.
- ౮౪ (ఎనభై నాలుగు) ఆసనాలు వేస్తూ అంతర్గతముగా ౧౮ (పద్దెనిమిది) క్రియలు చేస్తూ, షడ్చక్రాలు, స్వాధీనం చేసుకొని రోజుకు ౧౬ (పదహారు) గంటలు ధ్యానంలో మౌనస్థితిలో ఉంటారు.
- సాధన నేర్చుకునే గ్రూపునకు "దీక్ష" ఇచ్చేముందు" ఉపవాసము ఉండి తద్వారా వచ్చిన విశ్వాతీతశక్తిని ప్రతిసాధకునకు ప్రసరిస్తారు.
- భార్య, భర్త ఇరువురు నేర్చుకుంటే వారికి తపశ్శక్తి ధారపోస్తారు.
- క్లాసు చేసిన వారికి ధ్యానం మాస్టారుగారు మనో మౌనంతో ధ్యానస్థితిలో అంతర్గత శ్వాసలో ఉండి వారుస్వయముగా రాగి డాలరు ఉచితముగా ఇస్తారు.